ప్రిన్స్ మహేష్ మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి నటించారు. భార్య నమ్రత కొడుకు గౌతమ్, కూతురు సితార అందరు కలిసినటించటం ఒక మంచి అనుభూతిని ఇచ్చిందంటూ ట్విట్టర్ లో మహేష్ రాసుకొచ్చాడు. ఎప్పుడు సినిమాలతో బిజీ గా ఉండే మహేష్ కాస్త సమయం దొరికినా… ఫ్యామిలీ తో హాయిగా గడుపుతూ ఆ ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.
అయితే మహేష్ ఫ్యామిలీ నటించింది సినిమాలో కాదు ఒక యాడ్ లో. ఆ యాడ్ కి సంబంధించి ట్విట్టర్ లో వీడియో ని పోస్ట్ చేశాడు మహేష్.