అప్పుడూ ఇప్పుడూ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, ప్రిన్స్ మహేష్ బాబు తల్లీకొడుకులేనా !? సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989లో ఇద్దరూ కొడుకు దిద్దిన కాపురం మూవీలో తల్లీ కొడుకులుగా స్క్రీన్ పై మెరిశారు. అయితే అప్పుడు బాల నటుడు మహేష్, బిగ్ హీరోయిన్ విజయశాంతి.
మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు అమ్మ విజయశాంతితో యువహీరో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో నటిస్తున్నారు. సినీ జీవితచక్రం అలాంటిది. చక్రంలా అవకాశం ఇలా గిర్రున తిరిగి వచ్చిందని మహేష్ బాబు అలనాటి ఫోటోతో ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది.
13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ మహేష్ మూవీ సరిలేరు నీ కెవ్వరు కోసం మేకప్ వేసుకున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి రోల్ కీలకమైనదని అంటున్నారు. ఇద్దరూ తల్లీ కొడుకులుగా తెరపై యాక్షన్ సీన్స్ పండించే అవకాశం ఉందని ఫాన్స్ అంచనా…!