విశాఖపట్నంకు రాజధాని తరలిస్తామని ముఖ్యమంత్రి ప్రకటనతో విశాఖపై టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. వైజాగ్ లో టాలీవుడ్ ఏర్పాటు చెయ్యటంలో భాగంగా చిరంజీవి ఫిలిం స్టూడియోను నిర్మించాలని భావిస్తుండగా, మరో వైపు రామానాయుడు స్టూడియోస్ లోనూ మరిన్ని సౌకర్యాలు కల్పించి, సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చే భారీ చిత్రాలన్నీ అక్కడే నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట సురేష్ బాబు.
అంతే కాదు మహేష్ బాబు కూడా విశాఖపట్నం పై దృష్టి పెట్టారని సమాచారం. రాజధాని ఏర్పాటైతే వైజాగ్ మరింత రద్ధీగా మారనుంది. ఆ క్రమంలోనే ఇక్కడ మల్టీప్లెక్స్ బిజినెస్ కి డిమాండ్ పెరుగుతుందని గ్రహించిన మహేష్ – ఏషియన్ బృందం వెంటనే విశాఖ నగరంలో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం జగదాంబ పరిసరాల్లోనే ప్రైమ్ ఏరియాని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ గచ్చిబౌళి లో ఏఎంబీ పెద్ద సక్సెసైన నేపథ్యం లో అటు బెంగళూరులోనూ ఇదే తరహాలో భారీగా ఏఎంబీ మాల్ ని నిర్మిస్తున్నారు.