మహేష్ బాబు ఇటీవలి కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. భారీ ప్రాజెక్ట్ లు కూడా ఒప్పుకునే ఆలోచనలో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నాడు. ఈ సినిమాను రెండు నెలల్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జనవరి నుంచి రాజమౌళి సినిమాతో బిజీగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం తల్లి మరణంతో బాధలో ఉన్న మహేష్ త్వరలో షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉంది.
ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో జరిగే అవకాశం ఉందనే మాట వినపడుతుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు బరువు కూడా తగ్గాడనే మాట వినపడుతుంది. దీనికి సంబంధించి త్వరలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మహేష్ ఒక్కరే విదేశాలకు వెళుతున్నారని మెడికల్ కన్సల్టింగ్ పనుల కోసం వెళ్తున్నాడు అని అంటున్నారు.
విదేశాల నుంచి తిరిగొచ్చిన వెంటనే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ మొదలు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఆ సినిమాను విడుదల చేయనున్నారు. మహేష్, త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన రెండు సినిమాలు అనుకున్న విధంగా హిట్ కాలేదు అనే చెప్పాలి. అతడు సినిమా క్లాస్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది. ఖలేజా సినిమా పరిస్థితి కూడా దాదాపుగా అదే.