మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మళ్లీ మహేష్, తమన్నాలు ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపించనున్నారు. అయితే అది సినిమా కోసం కాదు లెండి. ఓ యాడ్ కోసం. పరుపుల కంపెనీకి చెందిన ఓ యాడ్‌లో వారిద్దరూ మళ్లీ కనిపించనున్నారు.
గతంలో మహేష్ బాబు, తమన్నాలు కలిసి నటించిన ఆగడు మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే మహేష్ బాబుకు చెందిన తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అందులో ఓ పాటలో తమన్నా మహేష్‌తో కలిసి స్టెప్పులేసింది. సరిలేరు నీకెవ్వరు మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లు కలిసి సంయుక్తంగా ఆ మూవీని నిర్మించాయి.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు, తమన్నాలు ఓ పరుపుల కంపెనీకి చెందిన యాడ్‌లో రొమాంటిక్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. ఆ యాడ్ ను త్వరలోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం.
మహేష్‌బాబు ప్రస్తుతం కీర్తి సురేష్‌తో కలిసి సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఆ మూవీని తీస్తున్నాడు. బ్యాంక్ స్కాం నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని తెలిసింది. ఇక తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ కంచరానాతో కలిసి ఓ తెలుగు మూవీలో నటించనుంది. కన్నడ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ మాక్ టెయిల్‌కు రీమేక్‌గా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.