ఏడాది క్రితం సూపర్ స్టార్ కృష్ణ రెండవ భార్య విజయ నిర్మల మృతి చెందిన విషయం తెలిసిందే. చిత్ర రంగంలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆమె హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించి అభిమానులనుం అలరించింది. దర్శకురాలిగా, హీరోయిన్ గా చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రేసుకుంది ఆమె.
కాగా,తెలుగు జాతి గర్వించేలా ఆమె విగ్రహ ఆవిష్కరణ జరుగబోతుంది. గురువారం ఆమె జయంతి సందర్బంగా విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. నానక్ రామ్ గూడలోని ఆమె నివాసంలోనే విజయ నిర్మల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఇంటిని సినీ పరిశ్రమ మ్యూజియంగా మార్చాలనే యోచిస్తున్నారు కృష్ణ. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తండ్రి కృష్ణ కోసం మహేష్ బాబు సూపర్ హాజరు కానున్నారు. అంతేకాకుండా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ విగ్రహావిష్కరణ కార్యమ్రంలో పాల్గొననున్నారు.