సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మహేష్ కు. అయితే ఎప్పటినుంచో మహేష్ అభిమానులు ఓ కోరిక కోరుకుంటున్నారు. అది మరేంటో కాదు…మహేష్ బాలీవుడ్ లో నటించాలని. కానీ మహేష్ మాత్రం అందుకు నో చెబుతూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు మహేష్ బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించాడు. అది సినిమా కోసం మాత్రం కాదు. ఒక యాడ్ కోసం.
సౌత్ ఇండియాలో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి ఈ యాడ్ లో నటింపచేసారట నిర్వాహకులు. గతంలో కూడా మహేష్ బాబు చాలా యాడ్స్ లో నటించారు. ఇక సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.