సుక్కుకు ఓకె చెప్పాడా ?

‘ రంగస్థలం ‘ మూవీ సక్సెస్ తో దర్శకుడు సుకుమార్ ని మరో లక్కీ ఛాన్స్ వెదుక్కుంటూ వచ్చింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రంగస్థలం లాంటి హిట్ చిత్రం తీసిన ఈ యువ దర్శకుడి తాజా ప్రాజెక్ట్ మీద అప్పుడే చర్చ మొదలైంది. లేటెస్ట్ వార్తల ప్రకారం.. సుకుమార్ తన నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించాలనే యోచనలో ఉన్నాడట.

ప్రస్తుతం ‘ భరత్ అనే నేను ‘ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ చిత్రం చేయనున్నాడు. ఆ ప్రాజెక్ట్ తరువాత సుకుమార్ డైరెక్షన్ లో పని చేసేందుకు ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా నిర్ధారణ కావలసి ఉంది.