సూపర్ స్టార్ మహేష్ బాబు 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు అభిమానులు , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని మహేష్ కోరడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు అంటూ ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ ప్లేస్ లో ఉంది. మొత్తం మహేష్ బర్త్ డే ట్వీట్స్ 10 మిలియన్లు దాటిపోయాయి. దీంతో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ 10 మిలియన్ బర్త్ డే ట్వీట్స్ అందుకున్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు మహేష్ బాబు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా మహేష్ పేరే కనిపిస్తోంది.