సూపర్ స్టార్ మహేష్‌బాబు సోషల్ మీడియాలో మరో రికార్డు క్రియేట్ చేశాడు. సౌతిండియాలో అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న హీరోగా మహేష్ బాబు ఘనత సాధించాడు తాజాగా మహేష్‌కు ట్విట్టర్‌లో 11 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఫలితంగా ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరో రికార్డుకెక్కారు. దీంతో మహేష్ మహేష్ ఫ్యాన్స్ #11millionmaheshians అనే హ్యష్ ట్యాగ్‌ను సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు
ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలోనూ మహేష్‌కు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 6.1 మిలియన్ల మంది అనుసరిస్తుండగా.. ఫేస్ బుక్‌లో 5.8 మిలియన్ల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు.