సూపర్ స్టార్ మహేష్ బాబు తను ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూనే ఉంటారు. కాస్త టైం దొరికినా విదేశీ యాత్రలకు ఎగిరిపోతాడు. గౌతమ్, సితారలతో ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. సర్కారు వారి పాట షూటింగ్ కు ఇంకాస్త సమయం ఉండటంతో విదేశీ విహార యాత్రలో ఉన్నారు.
ఆ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను మహేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా మరో ఫోటోని షేర్ చేశాడు. ఓ రెస్టారెంట్‌లో పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. `మా గ్యాంగ్‌తో డిన్నర్` అని కామెంట్ చేశాడు. అలాగే సితార కూడా తండ్రి, అన్నయ్యతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది.