మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే అందరిలానే సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో కూడా ముగ్గురు మహిళలు ఉన్నారు. వారు మరెవరో కాదు… మహేష్ తల్లి ఇందిర, అతని భార్య నమ్రత, ముద్దుల కూతురు సితార.
ఈ ముగ్గరు పట్ల మహేష్ ఎప్పడూ ప్రేమ, గౌరవంను చూపిస్తూ ఉంటాడు. ఇక నేడు మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టారు మహేష్.
To grit and grace
To beauty and brilliance
To kindness and resilience
Here’s to mine & all the women inspiring change!! అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా తల్లి ఇందిర, అతని భార్య నమ్రత, ముద్దుల కూతురు సితార ఫోటోలను షేర్ చేశారు.
అభిమానులు కూడా మహేష్ పోస్ట్ క్రింద ఇందిర, నమ్రత, సితారలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పంపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
To grit and grace
To beauty and brilliance
To kindness and resilience
Here's to mine & all the women inspiring change!! #HappyWomensDay pic.twitter.com/fISVuqdUF1— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2022
Advertisements