సరిలేరు నీకెవ్వరు సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్‌బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్సీవీ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కించాలనుకున్నాడు. ఇప్పటికే వంశీ పైడిపల్లి కథను కూడా సిద్ధం చేశాడు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో… వంశీ పైడిపల్లికి, దిల్ రాజుకు షాకిస్తూ మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్‌బాబు తాజా నిర్ణయం ప్రకారం గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం సీన్‌లోకి ఎంటరైనట్లె తెలుస్తోంది. పరశురాం చెప్పిన కథకు మహేష్ ఫుల్ సాటిస్‌ఫై కావటంతో… ఆ సినిమాను చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాను చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
దాంతో ఇప్పటి వరకైతే వంశీ పైడిపల్లి సినిమా ఇక అటకెక్కినట్లేనని సమాచారం. సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తర్వాత యూఎస్ టూర్‌కు వెళ్లిన మహేష్‌ను నవీన్ యేర్నేని కలిసి ఈ సినిమాపై చర్చించగా… మహేష్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సినిమాలో పూజా హెగ్డేను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మే నెలాఖరు నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకాబోతుంది.