ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతిని కలిశారు నమ్రత. సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం అయిన బుర్రిపాలెం గ్రామం ను మహేష్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనులకోసం భారతితో నమ్రత చర్చించారు. బుర్రిపాలెం గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడపాలని నమ్రత భారతిని కోరారు. మహేష్ బాబు చేస్తున్న స్వచ్చంద కార్యక్రమాలకు వైస్ భారతి ప్రశంసించినట్టు సమాచారం. ఇంకో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలకు మహేష్ బాబు చేపట్టాలని ఆకాక్షించినట్టు తెలుస్తుంది.