సితార …మహేష్, నమ్రతల గారాల పట్టి. తండ్రి మహేష్ పాటలకు డాన్స్ లు చేస్తూ ఆకట్టుకుంటుందీ చిన్నారి. ఇది వరకు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో లిరికల్ సాంగ్ లో కనిపించి అలరించింది. ఈ చిన్నారి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నిత్యం రకరకాల ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది సితార.సితారకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నమ్రత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తెలుగు సంవతస్సరాది ఉగాదిని పురస్కరించుకుని సితార పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా ముస్తాబైంది.
సితార కుందనపు బొమ్మ లా ముస్తాబైన ఫోటోను షేర్ చేసి మురిసిపోయారు నమ్రత. అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సితార ఉగాది వేడుక ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. సితార ఫొటోలు చూసిన అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియెకి బ్యాక్ గ్రౌండ్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు’ సినిమాలోని మెలోడీ సాంగ్ ప్లే అవుతుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.