ఇటీవల మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసిన దుండగులు రూ.12 కోట్లు కాజేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలు కీలక విషయాలు తెలుసుకున్నారు. హ్యాకింగ్ వెనకు నైజీరియన్లు ఉన్నారని నిర్థారణకి వచ్చిన అధికారులు.. వారితో పాటు.. రష్యా, చైనా హ్యాకర్ల కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వారి గుట్టు విప్పేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఖాతాదారుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాజేసిన సొమ్ముని మొత్తం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని 120కి పైగా ఖాతాలకు సైబర్ నేరగాళ్లు బదిలీ చేశారు.
దీంతో.. ఆ బదిలీ అయిన ఖాతాల వివరాలను సేరించే పనిలో సైబర్ క్రైం పోలీసులు పడ్డారు. మహేశ్ బ్యాంకు ఐటీ నిపుణులు.. షానవాజ్ అనే మహిళ అకౌంట్ లో ఒకేసారి 6.9కోట్లు క్రెడిట్ అవ్వడాన్ని గుర్తించారు. దీంతో వారు బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. బ్యాంకు సిబ్బంది రికార్డుల్లో ఉన్న ఆమె ఫోన్ నెంబర్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. ఆమె వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
కానీ.. ఆ మహిళ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసింది. ఈ విషయాన్ని బ్యాంక్ సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. పోలీసులు షానవాజ్ వివరాలను సేకరిస్తున్నారు. ఆమెకు సైబర్ నేరగాళ్లతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 12 కోట్లకు పైగా జరిగిన ఈ చోరీలో నైజీరియన్లతో పాటు చైనా, రష్యా హ్యాకర్ల హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.