మహేష్ బాబు భార్యగా సోషల్ మీడియాలో నమ్రతకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంశీ, అంజీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా కూడా మహేష్ బాబు భార్యగానే జనాలు ఎక్కువ గుర్తు పడుతుంటారు. పర్ఫెక్ట్ వుమెన్ అని నమ్రతను అంతా కొనియాడుతుంటారు. అలాంటి నమ్రత పుట్టిన రోజు నేడు. ఈ క్రమంలో మహేష్ బాబు తన భార్యకు విషెస్ అందించాడు.
హ్యాపీ బర్త్ డే నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని.. కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటున్నందుకు, నా ఎదుగుదలకు సాయం చేస్తున్నందుకు, నా వెన్నంటి ఉంటున్నందుకు థాంక్స్ అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ బాబు వేసిన ఈ పోస్ట్ ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. హ్యాపీ బర్త్ డే వదినమ్మ అంటూ ఘట్టమనేని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సితార అయితే అమ్మ మీద ప్రేమను ఇలా పంచుకుంది. హ్యాపీ బర్త్ డే అమ్మా.. నువ్వే నాకు ప్రపంచం.. నువ్వు ఎంత అద్భుతమైన దానివో.. ఈ బర్త్ డే కూడా నీకు అంతే అద్భుతంగా ఉండాలి.. నిన్ను ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. అని సితార తన అమ్మ మీదున్న ప్రేమను చాటుకుంది. లవ్యూ సో మచ్ అంటూ సితారా పోస్ట్ మీద నమ్రత రియాక్ట్ అయింది.
మామూలుగా అయితే నమ్రత బర్త్ డేను ఫ్యామిలీ అంతా కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు గౌతమ్ తన స్కూల్ ట్రిప్ అంటూ వెకేషన్లకు వెళ్లాడు. మహేష్ బాబు ఏమో త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సారి బర్త్ డేను నార్మల్‌గానే సెలెబ్రేట్ చేసుకునేట్టు కనిపిస్తోంది.