టాలీవుడ్ లో ఇటీవల వరుస విషాద ఘటనలు కన్నీరు పెట్టిస్తున్నాయి. కృష్ణం రాజు మరణ వార్తను మరువక ముందే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూయడం విషాదం నింపింది. ఇక ఆమె మరణం తర్వాత అనేక విషయాలు, ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. ఆమె వివాహం ఎలా జరిగింది…? కృష్ణ – విజయ నిర్మల వివాహం సమయంలో ఆమె ఏ విధమైన కండీషన్ లు పెట్టారు…?
ఆమె చివరి వరకు ఎవరి వద్ద ఉన్నారు…? సితారా, గౌతం కి ఆమె దగ్గర ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది…? ఇలా అనేక విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. పెద్ద కుమారుడు రమేష్ బాబు వద్ద ఆమె ఉండటం, ఆయన మరణం తర్వాత ఆమె మానసికంగా కృంగిపోయారు అని… అందుకే అనారోగ్యం తీవ్రమైందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంచితే ఇప్పుడు మరో విషయం వైరల్ అవుతుంది.
ఆమె చివరి కోరికను మహేష్ బాబు తీర్చలేకపోయారు అని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం… సితారకు ఓణీల కార్యక్రమం నిర్వహించాలని మహేష్ బాబుని అడిగారట. అయితే మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయారు. ఇప్పుడు ఆ విషయం గురించి బాధపడుతున్నారట. సితారకు నానమ్మతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇందిరా దేవి మరణించిన తర్వాత సితార మహేష్ దగ్గర కూర్చుని ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.