అమ్ములు కాదు.. అమ్మ!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. సినిమా జీవితంతో పాటే ఫ్యామిలీ లైఫ్ కూడా అందంగా.. ఆహ్లాదంగా ఉంచుకుంటాడు. కుటుంబానికి సంబంధించిన సంగతుల విషయంలో చాలా హుందాగా వ్యవహరిస్తాడని అతడి ఫ్యాన్స్ చెప్పుకుంటారు. కుటుంబ సభ్యుల్ని మీడియాకు కాస్త దూరంగా ఉంచడం కూడా ప్రిన్స్ కున్న ఒక అలవాటు. ఫామిలీ లైఫ్ గురించి ఆయన స్పందించిన దాఖలాలు చాలా అరుదు. ఆయనకు ఇద్దరు పిల్లలు.. గౌతమ్, సితార! తాజాగా కూతురు సితారకు సంబంధించిన ఒక క్యూట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ‘మా అమ్మాయి అచ్చం మా అమ్మలాగే వుంది’ అంటూ టాగ్ లైన్ కూడా పెట్టాడు. ఇప్పుడీ ‘సితార’ పిక్ తెగ వైరల్ అవుతోంది. లైక్స్ లెక్కయితే లక్ష దాటేసింది.