మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు. మరి మహేష్ కుటుంబ సభ్యుల పరిస్థితేంటి? వాళ్లు సినిమా చూశారా? చూసి మహేష్ కు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. దీనిపై మహేష్ రియాక్ట్ అయ్యాడు. తన పిల్లలు, తండ్రి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ను ఆడియన్స్ తో పంచుకున్నాడు.
“సర్కారువారి పాట మా ఫ్యామిలీతో చూసినప్పుడు మా అబ్బాయి గట్టిగా హాగ్ చేసుకున్నాడు. సితార పాప అన్ని సినిమాల్లో కంటే ఇందులో బాగా చేశానని, అందంగా వున్నాని చెప్పింది. నాన్నగారు చూసి .. పోకిరి దూకుడుకి మించిపొతుందని అన్నారు. ఈ క్రెడిట్ దర్శకుడు పరశురాంకి దక్కుతుంది. ఈ సినిమాని అంత చక్కగా డిజైన్ చేశారు.”
ఇలా సర్కారువారిపాట సినిమా తన కుటుంబానికి కూడా నచ్చిందని చెప్పుకొచ్చాడు మహేష్. ఇక నమ్రత విషయానికొస్తే, ఆమె స్వయంగా క్రాస్ రోడ్స్ లో సినిమా చూసి, దర్శకుడితో కలిసి సెలబ్రేషన్ కేక్ కట్ చేశారు.
సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఒక మాస్ మూమెంట్ చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఇదే వేడుకలో మాట్లాడిన మహేష్.. తన సినిమాపై ఫ్యామిలీ రియాక్షన్ ను బయటపెట్టాడు.