సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు కాస్త స్పీడ్ పెంచాడు. వరుస ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. తల్లి మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న మహేష్ బాబు కాస్త సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి సినిమాకు ముందు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉంది.
మహేష్ బాబు… రాజమౌళి ప్రాజెక్ట్ కి సంబంధించి క్రిస్మన్ కానుకగా ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సినిమాలో లేడీ విలన్ ఒకరు నటించే అవకాశం ఉందనే మాట వినపడుతుంది. మౌని రాయ్ ని ఆ సినిమాలో తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమాను క్లాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ప్లాన్ చేసారు. కథలో చిన్న చిన్న మార్పులు కూడా మహేష్ చెప్పారని అంటున్నారు.
ఇక ఈ సినిమా ద్వారా కూతురు సితారని టాలీవుడ్ కి పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు. నానమ్మ మరణంతో కాస్త డీలా పడిన సితారకు మహేష్ ఈ గుడ్ న్యూస్ చెప్పాడని అంటున్నారు. ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. మహేష్ బాబు అన్నకు ఆమె కూతురిగా నటించే అవకాశం ఉందని లేదా మేనకోడలి పాత్ర చేయవచ్చు అని అంటున్నారు.