సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా రాణిస్తూనే… యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారు సినిమా చేస్తున్నాడు మహేష్. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇదిలా ఉండగా ఈ సినిమా కు సంబంధించి మహేష్ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే…సర్కారు వారి పాట కోసం మహేశ్ బాబు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట . ఇకపోతే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.