బాహుబలి-2 సినిమా ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ మూవీగా అవతరించింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఆ స్థానంలో నిలిచింది. మరి ప్రభాస్ ఓవర్సీస్ కింగ్ అవుతాడా? లేక ఎన్టీఆర్-చరణ్ ఆ స్థానాన్ని దక్కించుకుంటారా? వీళ్లెవరు కాదు, ఓవర్సీస్ కింగ్ అంటే మహేష్ బాబు మాత్రమే. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవుతున్న ఒకే ఒక్కడు మహేష్ బాబు. అందుకే అతడు ఓవర్సీస్ కింగ్ అయ్యాడు.
మహేష్ నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. ఈ సినిమా మొదటి రోజుకే (ప్రీమియర్స్ తో కలుపుకొని) మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. ఇక్కడ క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం మేటర్ కాదు, మహేష్ సినిమాలు ఎన్ని ఈ క్లబ్ లో ఉన్నాయనేది మేటర్. మిలియన్ డాలర్ క్లబ్ లో మహేశ్ నుంచి ఏకంగా 11 సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి.
తెలుగు నుంచి మరే హీరోకు దక్కని గౌరవం ఇది. ఆ మాట కొస్తే సౌత్ నుంచి కూడా ఏ హీరోకు ఈ స్థాయిలో మిలియన్ డాలర్ క్లబ్ మూవీస్ లేవు. మహేష్ నటించిన 11 సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్ లో చోటు సంపాదించుకున్నాయి. ఇక మిగతా హీరోల సినిమాలు ఎన్ని ఈ క్లబ్ లో ఉన్నాయో చూద్దాం.
హీరోలు – మిలియన్ డాలర్ క్లబ్ మూవీస్
మహేష్ బాబు – 11 సినిమాలు
ఎన్టీఆర్ – 7 సినిమాలు
పవన్ కల్యాణ్ – 6 సినిమాలు
నాని – 6 సినిమాలు
అల్లు అర్జున్ – 5 సినిమాలు
ప్రభాస్ – 4 సినిమాలు
రామ్ చరణ్ – 3 సినిమాలు
విజయ్ దేవరకొండ – 3 సినిమాలు
వరుణ్ తేజ్ – 3 సినిమాలు