బడా సినిమాలన్నీ వరుసగా తమ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు సినిమా కూడా తెరపైకొచ్చింది. సర్కారువారి పాట సినిమాకు ఫ్రెష్ గా మరో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు మే 12 తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు. పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. ఆ టైమ్ కు ఆర్ఆర్ఆర్ వస్తుందనే సమాచారంతో అందరికంటే ముందే సినిమాను వాయిదా వేసి, ఏప్రిల్ రిలీజ్ పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ పరిస్థితులన్నీ మారిపోయాయి. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు సమ్మర్ కు వచ్చేశాయి.
దీంతో సర్కారువారి పాట సినిమాను మరోసారి వాయిదా వేసి మే 12 డేట్ లాక్ చేసుకున్నారు. పైగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. దీంతో వాయిదా అనివార్యమైంది. ఇక సర్కారు వారి పాట టీం ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ అద్భుతమైన రొమాంటిక్ మెలోడి సాంగ్‌ను రెడీ చేశారని తెలుస్తోంది.
కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మూవీలో యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు మేకర్స్