సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు నిర్మాత నాగవంశీ, కంటెంట్ ఓరియెంటెడ్ చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు సినిమాలను నిర్మించడమే కాకుండా, స్టార్స్ తో హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందిస్తుంటాడు.
ధనుష్ నటించిన సార్ సినిమా ఈ నెల 17న విడుదల కానుందని, పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని చెబుతున్నాడు నిర్మాత. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మహేష్ బాబు మూవీపై స్పందించాడు.
హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వస్తోంది మహేష్-త్రివిక్రమ్ సినిమా. ఈ బ్యానర్ కూడా నాగవంశీదే. పైగా మహేష్ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా నాగవంశీ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ మూవీ రిలీజ్ డేట్ పై స్పందించాడు నాగవంశీ.
ఆగస్ట్ 28న మహేష్-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించాడు ఈ నిర్మాత. ఈ మేరకు కాల్షీట్లు, షెడ్యూల్స్ అన్నీ సిద్ధమయ్యాయని తెలిపాడు. ఈ చిత్రాన్ని ముందుగా వేసవికి విడుదల చేయడానికి ప్లాన్ చేసారు, కానీ షూటింగ్ ప్రారంభం ఆలస్యం కావడంతో, ఆగష్టుకి వాయిదాపడింది.
ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ ఇంటిసెట్ వేస్తున్నాడు. ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ సెట్ నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ సెట్ లోనే మ్యాగ్జిమమ్ షూట్ పూర్తిచేయబోతున్నారు. వచ్చేనెల నుంచి పూజాహెగ్డే, శ్రీలీల సెట్స్ పైకి రాబోతున్నారు.