లాంగ్ గ్యాప్ తర్వాత సెట్స్ పైకొచ్చింది మహేష్ బాబు మూవీ. రామోజీ ఫిలింసిటీలో తీసిన ఓ యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ స్టార్ట్ చేశారు. 3 రోజులు ఫైట్ సీన్ తీసి గ్యాప్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ను కొనసాగించాలని అనుకునేలోపే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది.
అలా ఆగిపోయిన షూటింగ్ ను వచ్చే వారం నుంచి తిరిగి కొనసాగించాలని అనుకుంటున్నారు. అయితే, మహేష్ బాబు మాత్రం జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఈసారి పూజా హెగ్డేతో కొన్ని సన్నివేశాలు తీయాలని నిర్ణయించారు. దీపావళి తర్వాత మహేష్ బాబు జాయిన్ అవుతాడు.
దీపావళి తర్వాత నుంచి మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఊపందుకుంటుంది. అక్కడ్నుంచి మినిమం గ్యాప్స్ ఇస్తూ షెడ్యూల్స్ పూర్తిచేసి, సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు సిద్ధం చేయాలని అనుకుంటున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
హారిక-హాసిని బ్యానర్ పై భారీ బడ్జెట్ తో వస్తోంది ఈ సినిమా. ఇందులో సెకెండ్ హీరోయిన్ కు కూడా చోటుంది. ఆమె ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తారు. సినిమాలో ఐటెంసాంగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు మహేష్ బాబు.