మహేష్ మరోసారి హాలీవుడ్ బాట పట్టాడు. కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిపోయాడు. మరి అతడు చేయాల్సిన కొత్త సినిమా సంగతేంటి? త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేయాల్సిన సినిమా ఇప్పటికే చాలా ఆలస్యమౌతోంది. ఈ టైమ్ లో మహేష్ మరోసారి విదేశీ పర్యటన చేపట్టడం విమర్శలకు తావిచ్చింది.
దీనిపై తనదైన స్టయిల్ లో స్పందించాడు మహేష్. మాటలతో కాకుండా చేతలతో చూపించాడు. అవును.. ఓవైపు దుబాయ్ లో హాలిడే ట్రిప్ లో ఉంటూనే, మరోవైపు తన కొత్త సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటుచేశాడు. తమన్, త్రివిక్రమ్, మహేష్ కలిసి సినిమా కోసం కొన్ని ట్యూన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.
మహేష్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తమన్, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ దుబాయ్ వెళ్లారు. మహేష్ ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, అతడు దిగిన హోటల్ లో కాకుండా మరో హోటల్ లో దిగారు.
కేవలం కొన్ని గంటలు మాత్రమే ఈ భేటీ ఉంది. తర్వాత మహేష్ తిరిగి తన ఫ్యామిలీతో జాయిన్ అయ్యాడు. మధ్యలో ఓ యాడ్ షూట్ కూడా పూర్తిచేశాడు ఈ స్టార్ హీరో.