సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నికెవ్వరు. సంక్రాంతి కి విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ తో సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక మరో వైపు మహేష్ కు పోటీగా అదే సమయానికి దర్బార్ సినిమాతో రజనీకాంత్, ఎంత మంచివాడవురా సినిమాతో కళ్యాణ్ రామ్, అల వైకుంటాపురంలో సినిమాతో అల్లుఅర్జున్ రేస్ లో ఉన్నారు.
పోటీ ఎక్కువగా ఉండటంతో మహేష్ సినిమా ప్రచారంలో కొంచెం దూకుడు పెంచాడు. జనవరి మొదటి వారంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చెయ్యాలని, దీనికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ ను పిలవాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. కానీ సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ సినిమా కూడా ఉండటంతో అన్నను కాదని మహేష్ సినిమా గురించి ఎన్టీఆర్ వస్తాడో రాడో అని ఫిలింనగర్ వర్గాలు గుస గుసలాడుకుంటున్నాయి.
కానీ మహేష్ బాబు పిలిస్తే ఎన్టీఆర్ కాదనడని, గతంలో కూడా మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ మహేష్ ని పొగడ్తలతో ముంచేసిన సంగతి తెలిసిందే.