మహేష్ మరోసారి తన కాన్ఫిడెన్స్ బయటపెట్టాడు. తను ఏది ముట్టుకుంటే అది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పుకొచ్చాడు. తను నిర్మాతగా మారి తీసిన మేజర్ సినిమా ట్రయిలర్ లాంచ్ లో మాట్లాడిన మహేష్.. అడివి శేష్ నటించిన మేజర్ చూసి తన గొంత తడారిపోయిందని చెప్పుకొచ్చాడు.
“మేజర్ టీమ్ ని చూస్తే గర్వం గా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమిషాల మౌనం తర్వాత శేష్ ని హగ్ చేసుకున్నాను. బయోపిక్ తీయడం ఓ బాధ్యత. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. మేజర్ టీం మొత్తం ఆ భాద్యతని చక్కగా నిర్వహించారు.”
మేజర్ సినిమా షూటింగ్ లో రెండేళ్లుగా యూనిట్ అంతా తనకు థ్యాంక్స్ చెబుతున్నారని, కానీ సినిమా చూసిన తర్వాత తను యూనిట్ మొత్తానికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు మహేశ్. తను కెరీర్ లో రిస్క్ తీసుకోనని, ఏది టచ్ చేస్తే అది బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నాడు.
“రెండేళ్ళుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన మేజర్ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న మేజర్ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమాగా కూడా అద్భుతంగా ఉండబోతుంది.”
అడవి శేష్ హీరోగా నటించిన సినిమా మేజర్. సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ ఆధారంగా తీసిన ఈ సినిమాకు శిశికరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై అడివి శేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.