సందీప్ 'గ్యారేజ్'లో మహేష్.. ప్రిన్స్ సుడి తిరిగినట్లే..

‘అర్జున్ రెడ్డి’ మూవీతో సంచలనం సృష్టించిన సందీప్ వంగ టాలీవుడ్ లో ఇప్పుడు ‘హాట్ కేక్’!  అతడితో సినిమా చేయాలని మెయిన్ స్ట్రీమ్ హీరోలందరూ ఉత్సాహం చూపుతున్నారు. మెగా ఫ్యామిలీ ఇప్పటికే సందీప్ దగ్గర కర్చీఫ్ వేసిందట! అతడి టేకింగ్, మేకింగ్ చూసి ముచ్చట పడ్డ ప్రిన్స్ మహేష్ బాబు సైతం.. రారమ్మని కబురు పెట్టేశారు. తన దగ్గరున్న మెకానిక్ స్టోరీ చెప్పి మహేష్ బాబును ఫ్లాట్ చేశారని.. వెంటనే డేట్స్ కూడా ఇచ్చేశారని టాలీవుడ్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. మహేష్ బాబు డేట్స్ ‘అడ్జస్ట్ మెంట్’పై దృష్టి పెట్టినట్లు గట్టిగా చెబుతున్నారు. ‘బిజినెస్ మెన్’ మూవీలో రిచ్ లుక్ తో అదరగొట్టిన మహేష్ బాబు.. ఈసారి చేతిలో బోల్డ్ అండ్ స్పానర్ పట్టుకుని.. కొత్తగా కనిపించనున్నారని.. మహేష్ చూపించబోయే ఈ మార్పు అతడి కెరీర్ ని మలుపు తిప్పడం ఖాయమని చెప్పుకుంటున్నారు అతడి ఫాన్స్. ‘జనతా గ్యారేజ్’ మూవీలో మెకానిక్ గా కనిపించి తారక్ సక్సెస్ కొట్టినట్లే.. ప్రిన్స్ కూడా బ్రేక్ ఇస్తారని భావిస్తున్నారు. సందీప్ వంగ -ప్రిన్స్ మహేష్ మధ్య కుదిరిందంటున్న ఈ డీల్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటివరకు ఏమీ లేదు. ప్రస్తుతానికి మహేష్.. కొరటాల శివ డైరెక్టన్లో ‘భరత్ అనే నేను’ మూవీ చేస్తున్నారు.