చాలా ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఖలేజా తర్వాత వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఈమధ్యే ఆ గ్యాప్ భర్తీ అయింది. దీంతో సినిమా సాకారం అయింది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. టైటిల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇప్పుడా టైటిల్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది.
మహేష్-త్రివిక్రమ్ సినిమాకు అర్జునుడు అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి చేసిన ఓ సినిమాకు అతడు అనే టైటిల్ పెట్టారు. సో.. ఈసారి కూడా అ అనే అక్షరంతో మొదలయ్యేలా అర్జునుడు అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. మధ్యలో ఖలేజా వచ్చినప్పటికీ అది ఫ్లాప్ అవ్వడంతో వదిలేశారు.
తాజా సినిమాకు సంబంధించి మహేష్, తమన్, త్రివిక్రమ్ ఇప్పటికే ఓసారి దుబాయ్ లో కలుసుకున్నారు. కథ చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్ లాంటివి పూర్తి చేశారు. ఇప్పుడు మరోసారి వీళ్లంతా దుబాయ్ లో కలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం మహేష్, తన కుటుంబంతో కలిసి యూరోప్ లో పర్యటిస్తున్నాడు. అతడు పర్యటన పూర్తి చేసుకొని దుబాయ్ కు వచ్చేసరికి.. తమన్-త్రివిక్రమ్ దుబాయ్ లో వాలిపోయేలా ప్లాన్ చేసుకున్నారు. దుబాయ్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫైనల్ సిట్టింగ్స్ ముగుస్తాయి. ఆ వెంటనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.