మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు డేట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. మరో 3 రోజుల్లో, అంటే 18వ తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.
రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. ఈ సినిమాకు బల్క్ కాల్షీట్లు కేటాయించాడు మహేష్. జనవరి 18 నుంచి ఏకంగా 4 నెలల పాటు త్రివిక్రమ్ సినిమా కోసం పనిచేయబోతున్నాడు మహేష్. అలా ఎలాంటి గ్యాప్స్ లేకుండా సినిమాను పూర్తి చేయబోతున్నాడు.
ఆగస్ట్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇంతకుముందే ప్రకటించారు నిర్మాతలు. చెప్పిన తేదీకి సినిమా రెడీ చేయడం కోసం తన పూర్తి సహకారాన్ని అందించబోతున్నాడు మహేష్. తల్లి-తండ్రిని కోల్పోయిన బాధ నుంచి పూర్తిగా కోలుకొని షూటింగ్ కు రెడీ అవుతున్నాడు
ఈ మూవీకి సంబంధించి ముందు అనుకున్న కథతో కాకుండా, మరో కొత్త కథతో సెట్స్ పైకి రాబోతున్నారు. అతడు, ఖలేజా టైపులో యాక్షన్ ఎంటర్ టైనర్ తోనే సెట్స్ పైకి రాబోతున్నారు. ఈ మేరకు టోటల్ స్క్రీన్ ప్లే రెడీ అయింది.
పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించనుంది. ఆమె కూడా కాల్షీట్లు కేటాయించింది. మరోవైపు తమన్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడు.