రిలీజ్‌కు ముందే రికార్డు

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘ భరత్ అనే నేను ‘ విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా 2000 థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షో లను ప్రదర్శించ నున్నట్టు ఈ మూవీ యూనిట్ తెలిపింది. అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్య కన్నా ఎక్కువ థియేటర్లలో ” భరత్ అనే నేను ” చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొంది.

ప్రీమియర్ షో లకు అప్పుడే టికెట్ల అమ్మకం ప్రారంభమైందని, మొత్తం వెయ్యి సినిమా హాల్స్ లో చిత్రం విడుదల అవుతోందని యూనిట్ సభ్యులు వెల్లడించారు. సినిమా హిట్ టాక్ వస్తే తొలి వీకెండ్ లోనే 3 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రావచ్చన్నది ట్రేడ్ ఎనలిస్టుల అంచనా. ఇండియాలో బుక్ మై షో వంటి సైట్లలో టికెట్ల అమ్మకం ప్రారంభమైంది.