పెళ్లి అంటే చాలు ఆడవాళ్ళు ధగధగా మెరిసిపోతుంటారు. రకరకాల చీరలతో అట్రాక్షన్ గా నిలుస్తారు. అయితే సెలెబ్రిటీల పెళ్లి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఆ ధగధగలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. తాజాగా దగ్గుబాటి రానా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్ళిలో వధువు మిహీక బంగారు, క్రీమ్ రంగు లెహంగాలో మెరిసిపోగా, సమంత.. నీలం రంగు చీరలో అదరగొట్టింది. అయితే వాటి ధరలు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోయాయి. మిహీక డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేయగా ఈ డ్రెస్ వెనుక వందల గంటల శ్రమ ఉందట. ఈ ఒక్క డ్రెస్ కోసం మిహీక సుమారు 6 లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం. హల్దీ వేడుకలో ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్ కూడా 2 లక్షల వరకు ఉంటుందటున్నారు. దీనిని అర్పితా మెహతా డిజైన్ చేశారు. ఇక సమంత డ్రెస్ విషయానికొస్తే… పెళ్లికి నీలం రంగు చీరలో వచ్చింది. దీనిని రా మాంగో టీమ్ డిజైన్ చేసింది. దీని ధర కూడా లక్షల్లో ఉంటుందంట.