హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ఒవైసీ జంక్షన్ లోని ఫ్లై ఓవర్ ప్రారంభమైంది. హోంమంత్రి హహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ దీన్ని ప్రారంభించారు. రూ.63 కోట్ల ఖర్చుతో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్, మంత్రి సబితా సహా పలువురు పాల్గొన్నారు.
ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో ఓల్డ్ సిటీ నుంచి ఎల్బీనగర్ వైపునకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. దీనికి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును పెట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్. ఇదే ప్రాంతంలో ఓ దశాబ్ద కాలం పాటు కలాం నివాసమున్నారని.. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం కల్పించిందని వివరించారు.