ఈ ఒకసారి ఎన్నికలలో పోటిచేసి గెలువాలని అనుకున్న వారికి నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.. పోటి చేయాలని అనుకున్న వారి అంచనాలు తారుమారు అయ్యాయి… రిజర్వేషన్ల మార్పులు చేర్పులతో పోటి చేయాలని అనుకున్న అభ్యర్దులు, తమకు అనుకూలంగా వున్న వారి కోసం వెతుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ వార్డుల సంఖ్య పెరగడంతో ఆశావాహుల సంఖ్య కూడా పెరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాల్టిలలో 338 వార్డులు కాగా జనరల్ క్యాటగిరికి 171, ఎస్సిలకు 46, ఎస్టి లకు 21, బి.సి లకు 100 కేటాయించడం జరిగింది. మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలో కలక్టర్లు డిప్ సిస్టమ్ ద్వారా రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. తమకు అనుకూలంగా వున్న వార్డు నుంచి టికెట్ ఆశించి.. రాదని తెలిసిపోయిన వారు మరో పార్టిలో చేరడం జరిగింది. తీర చూస్తే మహిళలకు కేటాయించడం, మరికొన్ని ప్రాంతాలలో రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రాకపోవటంతో చాలా మంది నేతల్లో అసంతృప్తి నెలకొంది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » పొలిటికల్ ఫ్యూచర్ మార్చిన రిజర్వేషన్