శివ నిర్వాణ, నాగచైతన్య కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మజిలీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందా అంటే అవుననే టాక్ నడుస్తుంది ఫిలింనగర్ లో. ఇక నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శివ నిర్వాణ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇటీవల టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ.
Advertisements
ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే నిజానికి ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో శివ సినిమా చేయబోతున్నాడు అంటూ అప్పుడు టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం… విజయ్ దేవరకొండ ప్లేస్ లో నాగచైతన్య నటించబోతున్నారట. ఇది తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే కథ కావడంతో విజయ్ నో చెప్పాడట. చైతు మాత్రం కథ నచ్చడంతో ఓకే చేసాడని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందట.