ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని పీరా గర్హీ లోని గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఓ ఫ్యాక్టరీలో మంటలంటుకుని పేలుళ్ల జరిగాయి. ఈ పేలుళ్ల ధాటికి ఫ్యాక్టరీలోని కొన్ని నిర్మాణాలు కూలిపోయాయి. వాటి శిధిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారిలో ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. ఫ్యాక్టరీలో మంటలంటుకోగానే అందులో ఉన్న వారిని రక్షించడానికి 35 మంది ఫైర్ ఇంజనీర్లు వారిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు.