ముంబై తీవ్రవాద దాడిలో ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు గూడచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు.
పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ రోజు అడవి శేషు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. విడుదల చేసిన తక్కువ సమయంలోనే మేజర్ లుక్ కు విశేష స్పందన వస్తోంది.