శశికిరణ్ దర్శకత్వంలో అడవి శేషు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మేజర్. ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. ప్రకాష్ రాజు, రేవతి, మురళి శర్మ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మించారు.
ఇక కథ విషయానికి వస్తే మేజర్ సందీప్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి. చిన్ననాటినుంచి నేవీ చేరాలని కలలు కంటూ ఉంటాడు. అనుకోకుండా ఆర్మీలో చేరాల్సి వస్తుంది. అప్పుడే ఇషా పాత్రలో నటించిన సాయి మంజ్రేకర్ పరిచయమవుతుంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకుంటారు. ఆ తర్వాత ఆర్మీలో ఎన్ఎస్జి కమెండో టీంకు ట్రైనర్ గా దిగుతాడు. కొన్నాళ్లకు ఇంట్లో సమస్యలు రావడంతో ముంబై బయలుదేరుతాడు. అయితే అప్పటికే ముంబై లో ఉగ్రవాదులు దాడులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో సందీప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తాజ్ హోటల్‌లో దాగిన ఉగ్ర వాదులను మట్టు పెట్టడంలో సందీప్ ఎలాంటి పాత్రను పోషించాడు అనేది కథ.
ఇక ప్లష్ పాయింట్స్ విషయానికి వస్తే గతంలో ముంబై ఉగ్రదాడులపై చాలా సినిమాలు వచ్చాయి. కానీ మేజర్ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. నటీనటులు, కాస్ట్యూమ్స్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా తీసుకున్నాడు దర్శకుడు శశికిరణ్. అలాగే అడవి కేసు కూడా తన బాడీ లాంగ్వేజ్ ని కథకు తగ్గట్టు మార్చుకున్నాడు. యుక్తవయస్కుడిగా, దేశం కోసం ప్రాణ త్యాగం చేసే సైనికుడిగా అద్భుతంగా నటించాడు. అలాగే అడవి శేషు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ థియేటర్ కు వచ్చే ప్రతి ప్రేక్షకుడికి టచ్ అవుతాయి. అలాగే తల్లి పాత్రలో నటించిన రేవతి కూడా అద్భుతంగా నటించారు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ దేశ సేవలో ఉన్న భర్త కోసం ఎదురు చూసే ఇల్లాలిగా, తన నటనతో ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ గా నిలిచింది. అలాగే శోభిత ధూళిపాళ కూడా తన పాత్ర మేరకు బాగా నటించింది. ఆర్మీ ఆఫీసర్ గా మురళీశర్మ కూడా తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు.
ఇక మైనస్ పాయింట్లు విషయానికి వస్తే ఫస్టాఫ్ కాస్త స్లో గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే సందీప్ కు సైనికుడిగా మారాలనుకునే ఆలోచన వచ్చాక అది మారే విధానం ఇంకాస్త మెరుగ్గా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. అంతే కాకుండా దాడుల సమయంలో ముంబై పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే అందుకు సంబంధించిన అంశాన్ని అసలు చూపించలేకపోయారు. మొత్తంగా భారీ అంచనాల మధ్య తెరకెక్కిన మేజర్ అంచనాలకు ఏ మాత్రం తగ్గలేదు. అలాగే ప్రతీ ఒక్కరూ కూడా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఈ మేజర్.