అడవి శేషు హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్,లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు కూడా పెంచాయి. ఇక ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.
మే 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సోని పిక్చర్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Witness the Might of Major on Big Screens 💪#MajorTheFilm worldwide release on 27 May, 2022 🔥🔥#MajorOnMAY27 @AdiviSesh @saieemmanjrekar @SashiTikka #SriCharanPakala @sonypicsindia @urstrulyMahesh @GMBents @AplusSMovies @ZeeMusicsouth pic.twitter.com/JpAqhhSFLI
— GMB Entertainment (@GMBents) February 4, 2022
Advertisements