శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేషు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శోభిత ధూళిపాళ,సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పుడు వాయిదా వేసుకున్నారు.
ఇప్పటికే చాలా సినిమాలు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రిలీజ్ వాయిదా వేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కూడా రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ అధికారికంగా ప్రకటన చేశారు మేకర్స్.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. నియమాల దృష్ట్యా మేజర్ సినిమాను వాయిదా వేస్తున్నాం. దేశం కోసం తెరక్కించిన మేజర్ చిత్రాన్ని.. దేశంలోని పరిస్థితులు అన్ని చక్కబడ్డాకా మరో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించి విడుదల చేస్తాం. అప్పటివరకు మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను సోని పిక్చర్స్, జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్, a+s మూవీస్ పతాకంపై సంయుక్తం గా నిర్మిస్తున్నారు.