చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - Tolivelugu

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

major road accident in chittoor and 8 members lost life in container accident, చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కంటైనర్ బ్రేక్ ఫెయిల్ కావటంతో 12 మంది మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి చిత్తూరుకు వస్తున్న కంటైనర్ బంగారు పాళ్యం మొగలిగట్ వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటో, మినీ వ్యాన్ని ఢీ కొట్టింది. 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మృతుల్లో కంటైనర్ డ్రైవర్, క్లీనర్, చిత్తూరు నుండి గంగవరం వెళుతున్న మినీ వ్యాన్ లో ఎనిమిది మంది అయిన రామచంద్ర , రాము , సావిత్రమ్మ , ప్రమీల , గురమ్మ , సుబ్రమణ్యం , శేఖర్ , పాపమ్మ , వీరందరూ గంగవరం మండలం మర్రిమాకుల పల్లె గ్రామానికి చెందిన వారు. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కంటైనర్ కిందపడిన నా ద్విచక్ర వాహనం దారుడు నరేంద్ర సైతం మృతి చెందాడు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp