రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. తనకు అంతర్గతంగా గాయాలేమీ లేవని డాక్టర్లు ధృవీకరించారు. బైక్ పై నుండి పడగానే మొదట తనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ తనకు ఫిట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలోకు తరలించారు.
అయితే, తేజ్ కు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న తేజ్ కు ఆదివారం కాలర్ బోన్ ఫ్రాక్చర్ కు సర్జరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం తనకు బ్రెయిన్ ఎమ్మార్ఐ స్కానింగ్ కూడా చేశారని… ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. తను హెల్మెట్ పెట్టుకోవటం వల్లే ప్రాణపాయం నుండి బయటపడ్డట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
తేజ్ కు మొదట చికిత్స అందిస్తున్న దృశ్యాలు-