అడివి శేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ మేజర్. ఈ సినిమా నుంచి హృదయం అనే లిరిక్స్ తో సాగే లిరికల్ వీడియో ఆల్రెడీ విడుదలైంది. ఇప్పుడా పాటకు సంబంధించిన పూర్తి వీడియోను విడుదల చేశారు. హృదయమా అనేది మేజర్ కు, అతడి ప్రేయసికి ఉన్న అందమైన బంధం గురించి చెప్పే ఒక మధురమైన మెలోడీ.
శేష్, సయీ మంజ్రేకర్ మధ్య లిప్-లాక్ సీన్ ఈ పాటలోనిదే. ఆ లిప్ లాక్ ను కూడా ఇందులో చూపించారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాటను సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ శ్రావ్యంగా ఆలపించాడు. కృష్ణకాంత్, విఎన్‌వి రమేష్ కుమార్ ఈ పాటకు సాహిత్యం అందించారు.
దేశం కోసం మేజర్ తన ప్రేమను, కుటుంబాన్ని, సర్వస్వాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్లిపోయాడనేది ఈ పాటలో నీట్ గా చూపించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన మేజర్ మూవీ జూన్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్లు, ఈ నెలాఖరు నుంచి ప్రారంభం అవుతాయి.
శోభిత ధూలిపాళ్ల సెకెండ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాపై అడివి శేష్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తన కెరీర్ ను మలుపుతిప్పే సినిమాగా మేజర్ నిలుస్తుందని నమ్ముకున్నాడు.