త్వరలో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపధ్యంలో పన్ను చెల్లించే వారు కొత్త విధానాల కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ఏయే మార్గాల్లో పన్ను తగ్గింపు ఉంటుంది అనేది చాలా మందికి క్లారిటీ లేదు. 80C, 80CCC మరియు 80CCD (1) కింద కొంత వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. గరిష్టంగా వీటి ద్వారా రూ. 1.5 లక్షల వరకు పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూస్తే…
సెక్షన్ 80D
సెక్షన్ 80D కింద, మీరు ఆరోగ్య బీమా ప్రీమియంల కింద వచ్చిన ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. మీరు స్వయంగా తీసుకున్న భీమా, జీవిత భాగస్వామి అలాగే మీపై ఆధారపడిన పిల్లల కోసం రూ. 25,000 వరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. 60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు రూ. 25,000 అదనపు మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన మీ తల్లిదండ్రుల కోసం రూ. 1 లక్ష వరకు క్లెయిమ్ చేయవచ్చు.
సెక్షన్ 80DD
సెక్షన్ 80DD కింద, మీపై ఆధారపడిన వికలాంగులపై ఖర్చుల కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. 80% వరకు వైకల్యం ఉన్నవారికి మీరు రూ. 75,000 మినహాయింపును మరియు తీవ్రమైన వైకల్యాల కోసం రూ. 1.25 లక్షల మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
సెక్షన్ 80E
సెక్షన్ 80E కింద, మీరు ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ చెల్లింపు కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఉన్నత విద్యా రుణంకు మినహాయింపు కోసం ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా రుణ వడ్డీపై మినహాయింపు ఇస్తారు.
సెక్షన్ 80EE
సెక్షన్ 80EE కింద, మీరు మొదటిసారిగా ఇంటి యజమానులు అయిన వారు హోమ్ లోన్ వడ్డీ చెల్లింపు కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. ఈ ఆప్షన్ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం రూ. 2 లక్షల పరిమితికి మించి రూ. 50,000 వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
సెక్షన్ 80G
సెక్షన్ 80G కింద, గుర్తించిన స్వచ్ఛంద సంస్థలకు విరాళాల కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. నిర్దిష్ట నిర్దిష్ట సామాజిక సంస్థలకు విరాళాల కోసం గానూ జాతీయ రక్షణ నిధి, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, జాతీయ పిల్లల నిధి వంటి 50% లేదా 100% వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
సెక్షన్ 80GG
సెక్షన్ 80GG కింద, హెచ్ ఆర్ ఏ లేని ఉద్యోగులు చెల్లించే అద్దె కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. ఇది మొత్తం ఆదాయంలో –25% కంటే తక్కువగా ఉండాలి లేదా నెలకు రూ. 5000 లేదా మొత్తం ఆదాయంలో 10 శాతానికి మించి అద్దె చెల్లించాలి.
సెక్షన్ 80TTA
సెక్షన్ 80TTA కింద, మీరు పొదుపు ఖాతా వడ్డీ కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. మీకు ఏదైనా బ్యాంక్, పోస్టాఫీసు లేదా కో-ఆపరేటివ్ సొసైటీలో ఖాతా ఉంటే గరిష్టంగా రూ. 10,000 తగ్గింపును మీరు క్లెయిమ్ చేయవచ్చు.
సెక్షన్ 80U
సెక్షన్ 80U కింద, వికలాంగ పన్ను చెల్లింపుదారులు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. రూ.75,000 నిర్ణయించగా, తీవ్ర వైకల్యాలకు రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు.
సెక్షన్ 80DDB
సెక్షన్ 80DDB కింద, మీరు ప్రకటించిన అనారోగ్యాల చికిత్స కోసం ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. 60 సంవత్సరాల వయస్సు వరకు మీరు రూ. 40,000 వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు, సీనియర్ మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు ఇది రూ. 1 లక్ష వరకు అనుమతించారు.
సెక్షన్ 80GGB మరియు 80GGC
ఈ విభాగం కింద, కంపెనీలు మరియు వ్యక్తులు రాజకీయ పార్టీకి ఇచ్చిన విరాళాలకు తగ్గింపులను క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది.