బాలీవుడ్ భామ మలైకా అరోరా ఏప్రిల్ 2న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై వరుసగా మూడు కార్లు ఒకదాని తర్వాత మరొకటి ఢీకొన్ని ఘటనలో మలైకా అరోరాకు గాయలయ్యాయి. అయితే, ఈ ప్రమాదం తర్వాత తొలిసారి మలైకా సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఆనాటి నుండి ఇప్పటి వరకూ జరిగిన సంఘటనపై ఆమె భావోద్వేగాలను అభిమానులతో పంచుకున్నారు.
తనకు యాక్సిడెంట్ అయిన ఘటన ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని అన్నారు. ఏదో సినిమాలో జరిగిపోయినట్టుగా జరిగిందని చెప్పారు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే తనతో పాటు ఉన్నవారు, తన చుట్టూ ఉన్నవారు సాయం చేశారని, తనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు.
‘నాకు యాక్సిడెంట్ అయిన సంఘటన ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. అదేదో సినిమాలో జరిగినట్టుగా అయిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో నాతో పాటు ఉన్నవారు, నా చుట్టుపక్కల వారు ఎంతో సాయం చేశారు. నన్ను వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అక్కడి వైద్య సిబ్బంది సంపూర్ణ సహకారంతో నేను త్వరగా కోలుకోగలిగాను. ఇక స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూపించిన ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ ఎమోషనల్ పోస్టును మలైకా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
అంతే కాదు, తానో పోరాట యోధురాలినని, అతి త్వరలోనే తిరిగి జనం మధ్యకు వస్తానని తెలిపారు. బాలీవుడ్‌లో పాపులర్ ఫిగరైన మలైకా అరోరా దిల్ సే సినిమాలో చయ్యా చయ్యా పాటతో ఓవర్ నైట్ స్టారైపోయారు. మాహి వే, మున్నీ బద్నం లాంటి హిట్ ఐటమ్ నంబర్లతో క్రేజ్ పెంచుకున్నారు. అలాగే తెలుగులోనూ కొన్ని చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ చేసిన మలైకా.. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోన్నారు.
Advertisements