హైడ్రాక్సీక్లోరిక్విన్ యాంటీ వైరల్ డ్రగ్.లూపస్, ఆర్థరైటిస్, మలేరియా వ్యాధుల చికిత్స కు ఉపయోగించే ఔషధం.ఈ మెడిసిన్ వల్ల కరోనా వైరస్ ను కూడా కట్టడి చేయొచ్చని అంటున్నారు.ఇదొక వివాదాస్పద చికిత్స గా మారిపోయింది. మొదట్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్ కరోనా తో యుద్దం చేస్తున్న హెల్త్ కేర్ సిబ్బందికి ఈ మెడిసిన్ ఇచ్చారు.తరువాతి కాలంలో తీవ్రమైన శ్వాశ కోస వ్యాధితో బాధపడేవారికి,కూడా ఈ మందును తరువాతి కాలంలో రికమెండ్ చేశారు.కొంతమంది నిపుణులు ఈ మెడిసిన్ సామర్ధ్యాన్ని ప్రశ్నించారు. కానీ వాక్సిన్ కనుక్కునే పరిశోధనలో మాత్రం ఈ ఔషధం ఉపయోగపడుతోంది.
ప్రస్తుతం హైడ్రాక్సీక్లోరిక్విన్ మెడిసిన్ ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది.కానీ , అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హైడ్రాక్సీక్లోరిక్విన్ మెడిసిన్ ఎగుమతులకు అనుమతించాల్సింది గా ప్రధాని నరేంద్ర మోడీని కోరిన నేపథ్యంలో ఎగుమతుల విషయంలో రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.కొన్ని నిబంధనల ప్రకారం మాత్రమే అడిగిన వారికి ఐఐ మెడిసిన్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది .
ఆదివారం క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌభా సమావేశంలో ఆరోగ్య కార్యదర్శి, ఔషధ శాఖ అధికారులు హాజరయ్యారు. దేశంలో అవసరమైన స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు చెప్పారు.హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులు ఎటువంటి మినహాయింపులు లేకుండా నిషేధించబడ్డాయి. తక్షణమే అమలులోకి వస్తుందని భారతదేశ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) ఏప్రిల్ 4 న ఇచ్చిన ఉత్తర్వులలో తెలిపింది.కానీ ట్రంప్ అభ్యర్థన మేరకు ఎగుమతుల నిషేధాన్ని సడలించే అవకాశం ఉంది.
మా ప్రధాన లక్ష్యం భారతీయుడికి తగినంతగా ఉండాలి, డిజిఎఫ్టి నుండి NOC తీసుకున్న తరువాత కేసుల వారీగా ఎగుమతి చేయడానికి కంపెనీలను మేము అనుమతిస్తాము అని అధికారులు చెబుతున్నారు.అయితే ఎగుమతులను అనుమతించడంపై ఇంతవరకు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) లేదా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి ఇప్పటివరకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదని చెప్పారు.