మాళవిక మోహన్ మాస్టర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. అయితే ఇపుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో జోడీ కట్టే గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. మారుతీ ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో మాళవిక ను హీరోయిన్ గా తీసుకోవాలి అని భావిస్తున్నారట.
పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారట.
త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మారుతీ ప్రస్తుతం నటీనటులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాడట.
మారుతి తన సత్తాను నిరూపించుకోవడానికి కొన్నాళ్లుగా వెతుకుతున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఇదే. ఈ సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకుని స్టార్ డైరెక్టర్ గా మారిపోవాలని చూస్తున్నాడు. మరి చూడాలి మారుతీ ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడో.