సినిమా సెలబ్రిటీలను చూడాలని, మాట్లాడాలని అందరికీ ఉంటోంది. పాత కాలంలో అది అంత సులువు కాకపోయేది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితిలో అది అంత పెద్ద కష్టమేమి కాదు. సోషల్ మీడియా సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరాన్ని దగ్గర చేసేసింది. ప్రస్తుతం సెలబ్రెటీలు అందరూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హీరోయిన్స్ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్స్, మూవీ అప్డేట్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటారు.
అంతేకాకుండా.. కొన్నిసార్లు ఫాలోవర్లతో లైవ్ చిట్ చాట్ నిర్వహిస్తూ.. వారు అడిగే ప్రశ్నలకు తమదైన స్టైల్లో సమాధానాలిస్తుంటారు కొందరు హీరోయిన్స్. నెటిజన్స్ సైతం కొన్నిసార్లు తమ పరిధిని దాటి ప్రశ్నలు అడగడం.. తారలు స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతోంది. తాజాగా.. హీరోయిన్ మాళవిక మోహనన్‌కు కూడా ఇలాంటి చెదు అనుభవమే ఎదురైంది.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవికా.. తాజాగా అభిమానులతో ”#ఆస్క్ మాళవిక” అంటూ తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్ అడిగిన తిక్క ప్రశ్నకు కంగుతిన్న మాళవిక.. తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. తమిళ్ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి నటించిన సినిమాలో బెడ్ సీన్లను ఎన్నిసార్లు చిత్రీకరించారు అంటూ నెటిజన్స్ పిచ్చి ప్రశ్న వేశాడు. అందుకు కూల్ గా స్పందించిన మాళవిక.. ముందు నీ తలలో ఏదో పాడైనట్లుంది.. అంటూ తన స్టైల్లో మరోసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జయాల్ తో కలిసి యుధ్రా అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ సినిమా చేయాలనుందంటూ ఇటీవలే తన మనసులోని మాటలను బయట పెట్టింది ఈ అమ్మడు. మాళవిక.. పెట్టా, మాస్టర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.